Congress: కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా.. సీనియర్ నేతలు ఏం చేస్తున్నారు..?

Congress: కాంగ్రెస్ పార్టీలో హైడ్రామా.. సీనియర్ నేతలు ఏం చేస్తున్నారు..?
Congress: కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల భేటీ ఆ పార్టీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

Congress: కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల భేటీ ఆ పార్టీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.. ఉదయం నుంచి పెద్ద హైడ్రామా నడిచింది.. ఉదయం పదకొండు గంటలకు సీనియర్లంతా సమావేశం కావాలని నిర్ణయించారు.. అయితే, సమావేశానికి ఐదుగురు నేతలు మాత్రమే హాజరయ్యారు.. మెజారిటీ నేతలంతా డుమ్మా కొట్టారు.. సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, మర్రి శశిధర్‌ రెడ్డి, జగ్గారెడ్డి, కమలాకర్‌రావు, శ్యామ్‌ మోహన్‌ మాత్రమే సమావేశానికి హాజరయ్యారు..

మెజారిటీ నేతలంతా గైర్హాజరు కావడంతో సమావేశాన్ని ఎటూ తేల్చకుండానే ముగించేశారు.. అయితే, తమది అసమ్మతి సమావేశం కాదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు చెప్పుకొచ్చారు.. సోనియా, రాహుల్‌ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని తీర్మానం చేశామన్నారు. మరోవైపు సీనియర్ల ప్రత్యేక సమావేశంతో కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు రచ్చకెక్కాయి..

ఇప్పటి వరకు పరోక్షంగా రేవంత్‌ను టార్గెట్‌ చేస్తూ వచ్చిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. సీనియర్ల సమావేశానికి హాజరై ఈసారి డైరెక్ట్‌గానే విమర్శలతో ఎటాక్‌ చేశారు.. కాంగ్రెస్‌లో రేవంత్‌ రెడ్డి ఫెయిర్‌ గేమ్‌ ఆడటం లేదన్నారు.. అందుకే తాము ఇన్‌డైరెక్ట్‌గా గేమ్‌ మొదలు పెట్టామన్నారు జగ్గారెడ్డి.. ప్రత్యేక సమావేశం పెడితే షోకాజ్‌ నోటీస్‌ ఇస్తామని బెదిరిస్తున్నారని.. నోటీసు ఇచ్చి సస్పెండ్‌ చేయమనండి.. సత్తా చూపిస్తానంటూ ఘాటుగానే కౌంటర్‌ ఇచ్చారు.

అటు ఈ సీనియర్ల సమావేశంపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ స్పందించారు.. ఇలాంటి సమావేశాల పేరిట కార్యకర్తల్లో సందేహాలు రేకెత్తించకూడదనే ఉద్దేశంతోనే తాము ఇక్కడికి వచ్చామన్నారు. కాంగ్రెస్‌ను చీల్చడానికి టీఆర్‌ఎస్‌ కుట్ర చేస్తోందని ఆయన మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story