CONGRESS: కవిత దీక్షతో ఏం ఉపయోగం: కాంగ్రెస్

CONGRESS: కవిత దీక్షతో ఏం ఉపయోగం: కాంగ్రెస్
X
నిరాహార దీక్షకు ముందు అత్తమామాల ఆశీర్వాదమా..?

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దీక్షపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్‌తో కలిసి కవిత ఢిల్లీలో ధర్నా చేస్తే బీసీల కోసం కొట్లాడినట్లు అవుతుందన్నారు. కవిత హైదరాబాద్‌లో దీక్ష చేయడం వల్ల ఏం ఉపయోగమని నిలదీశారు. నిరాహార దీక్ష చేసే ముందు కేసీఆర్, కేటీఆర్ ఆశీర్వాదం కాకుండా అత్తామామల ఆశీర్వాదాలు తీసుకోవడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు.

కవిత ఎవరో నాకు తెలియదు: కోమటిరెడ్డి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధర్నాకు దిగారు. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 7 వరకూ ధర్నా చేయనున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. కవిత ఎవరో తనకు తెలియదన్నారు. కవిత బీసీ ధర్నా పెద్ద జోక్ అన్న మంత్రి.. బీసీ రిజర్వేషన్‌ల కోసం కేంద్రంతో కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పారు.

Tags

Next Story