Sputnik V Vaccine : రష్యా నుంచి హైదరాబాద్ కి చేరిన 56.6 టన్నుల వ్యాక్సిన్లు..!

Sputnik V Vaccine : రష్యా నుంచి హైదరాబాద్ కి చేరిన  56.6 టన్నుల వ్యాక్సిన్లు..!
Sputnik V Vaccine : రష్యా నుంచి స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్లు ఈ తెల్లవారు జామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాయి.

Sputnik V Vaccine : రష్యా నుంచి స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్లు ఈ తెల్లవారు జామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాయి. ప్రత్యేక సరుకు రవాణా విమానంలో ఏకంగా 56.6 టన్నుల వ్యాక్సిన్లు హైదరాబాదుకు చేరాయి. ఇప్పటి వరకు దిగుమతి చేసుకున్న వ్యాక్సిన్ లలో రష్యా వ్యాక్సిన్ లే అతిపెద్ద దిగుమతి అని అధికారులు చెబుతున్నారు. పైగా స్పుత్నిక్ వి వ్యాక్సిన్ లను ప్రత్యేకంగా నిల్వచేయాల్సి ఉంటుంది. మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద స్పుత్నిక్ వ్యాక్సిన్లను స్టోర్ట్ చేయాలి. ఇందుకోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఫార్మా జూన్ టెర్మినల్లో ప్రత్యేక మౌలిక సదుపాయాలు ఉన్నాయి.

హైదరాబాద్లోని ఫార్మా కంపెనీలు మున్ముందు మూడున్నర బిలియన్ డోసుల వ్యాక్సిన్ లను ఉత్పత్తి చేస్తాయి. ఇక వీటిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయడం లేదా వ్యాక్సిన్లు తయారీకి అవసరమైన ముడి పదార్థాలు దిగుమతి చేసుకోవడం కోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఫార్మా కార్గో ప్రత్యేకమైన టెర్మినల్ ను ఏర్పాటు చేశారు. ఇలాంటి టెర్మినల్ దేశంలోనే మొదటిది. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విమానాశ్రయాన్ని సర్టిఫై చేసింది. ఔషధాల నిల్వా, పంపిణీలో మెరుగైన పద్ధతులు పాటిస్తున్నా ఎయిర్ కార్గో టెర్మినల్ గా కితాబిచ్చింది.



Tags

Read MoreRead Less
Next Story