Drunk and Drive: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

Drunk and Drive: తెలంగాణ హైకోర్టు సంచనల తీర్పు ఇచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులపై దాఖలైన 40 రిట్ పిటిషన్లను విచారించిన హైకోర్టు.... కీలక వ్యాఖ్యలు చేసింది. డ్రైవర్ తాగి పట్టుబడితే వాహనాన్ని వాహనదారుని సన్నిహితులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.
కొన్ని తప్పనిసరి సందర్భాల్లో వాహనాన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. పోలీస్ కస్టడీలోకి తీసుకున్న వాహనం ఆర్సీ చూపిస్తే వెంటనే రిలీజ్ చేయాలని ఆదేశించింది. అంతే కానీ మోటార్ వెహికిల్ యాక్ట్ ప్రకారం వాహనాన్ని సీజ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నమోదైన 40 కేసులను ధర్మాసనం ముగించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com