కరోనా ఎఫెక్ట్.. బడి బంద్ అయింది.. పరీక్షల మాటేమిటి.. తల్లిదండ్రుల్లో ఆందోళన

కరోనా ఎఫెక్ట్.. బడి బంద్ అయింది.. పరీక్షల మాటేమిటి.. తల్లిదండ్రుల్లో ఆందోళన
కరోనా తీవ్రత తగ్గింది కదా అనుకుంటే నేనెక్కడికీ వెళ్లలేదు ఇక్కడే ఉన్నానంటూ మళ్లీ ఒకసారి కోరలు చాచింది. దీంతో తెరుచుకున్న బడులు కాస్తా మళ్లీ మూతపడ్డాయి.

పోయిన ఏడాది పబ్లిక్ పరీక్షలు నిర్వహించకుండా చదువులు ముగిసాయి. భయం భయంగానే బళ్లు తెరుచుకున్నాయి. కరోనా తీవ్రత తగ్గింది కదా అనుకుంటే నేనెక్కడికీ వెళ్లలేదు ఇక్కడే ఉన్నానంటూ మళ్లీ ఒకసారి కోరలు చాచింది. దీంతో తెరుచుకున్న బడులు కాస్తా మళ్లీ మూతపడ్డాయి. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఈ సారి కూడా పబ్లిక్ పరీక్షలు జరుగుతాయా లేదా అన్న టెన్షన్ అటు విద్యార్థుల్లో, ఇటు తల్లిదండ్రుల్లో కలుగుతోంది.

ఇదిలా ఉంటే ప్రభుత్వం నెల రోజుల క్రితమే పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి 26 వరకు, ఇంటర్ పరీక్షలు మే 1 నుంచి 19 వరకు జరుగుతాయని ప్రకటించింది. కరోనాను దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ని కూడ తగ్గించి ఛాయిస్‌ని పెంచారు. అయినా అన్నీ సందేహాలు విద్యా సంస్థలు మూసివేయడంతో వార్షిక పరీక్షలు జరుగుతాయా లేదా అన్న సందిగ్దం నెలకొంది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకే ఏ నిర్ణయమైనా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

గతంలో ప్రకటించిన తేదీల ప్రకారం ఏప్రిల్ 1న మోరల్ సైన్స్, 3న ఎన్విరాన్ మెంటల్ సైన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే కళాశాలల మూసివేత కారణంగా ఆ రెండు పరీక్షల తేదీల్లో మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ఎంపీసీ, బైపీసీ, జియాలజీ ద్వితీయ సంవత్సరం, ఒకేషనల్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు జరుపుతామని అన్నారు. ఇప్పుడు అవి కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది.

తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా వేయడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండడం సమస్యగా మారుతోంది. దీనిపై కొందరు నిపుణులు ఆ మార్కులను మినహాయించి వార్షిక పరీక్షలు జరిపితే వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

ఇక పదవ తరగతి విద్యార్థుల పరీక్షల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఎఫ్‌ఏ-1 మాత్రమే పూర్తయింది. ఎఫ్‌ఏ-2 ఏప్రిల్ మొదటి వారంలో జరగాలి. ఈ పరీక్షలకు సంబంధించిన మార్కులు ఒక్కో సబ్జెక్ట్ నుంచి 20 మార్కులు ఫైనల్ పరీక్షల్లో కలుపుతారు. ఒకవేళ వార్షిక పరీక్షలు జరగని పక్షంలో ఎఫ్ఏ-2 నిర్వహించకపోతే ఎఫ్ఏ-1 ఆధారంగానే ఉత్తీర్ణలను చేయాల్పి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కనీసం పదవ తరగతి విద్యార్థులకైనా తగిన జాగ్రత్తలతో తరగతులు నిర్వహిస్తే బాగుండేదని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story