గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ రేంజ్‌లో నమోదవుతున్న కరోనా కేసులు..!

గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు ఓ రేంజ్‌లో నమోదవుతున్నాయి.. దీంతో నగర వ్యాప్తంగా మళ్లీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటవుతున్నాయి.. నగరంలో కరోనా కట్టడి కోసం జీహెచ్‌ఎంసీ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది.. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలో 63 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసింది.. చార్మినార్ జోన్‌లో అత్యధికంగా 12 కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయగా.. సికింద్రాబాద్ జోన్‌లో 11.. ఎల్బీనగర్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లిలో 10 చొప్పున కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.
మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో 63 మినీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు.. మినీ కంటైన్మెంట్ జోన్ల పరిధిలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు బల్దియా అధికారులు.. నిరంతరం శానిటేషన్, క్లీనింగ్‌తోపాటు వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. ఒక ఏరియాలో ఐదు కేసులకంటే ఎక్కువగా మినీ కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటిస్తున్నారు.. ఒకే అపార్ట్‌మెంట్‌లో కరోనా కేసులు బయటపడితే హౌస్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు బల్దియా అధికారులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com