బాన్సువాడలో కరోనా సోకిన వ్యక్తి హల్చల్ ..!

బాన్సువాడలో కరోనా సోకిన వ్యక్తి హల్చల్ ..!
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కరోనా సోకిన ఓ వ్యక్తి హల్చల్ చేశారు. తిమ్మానగర్ కు చెందిన నారాయణ కరోనా సోకి ఏరియా ఆసుపత్రి ఐసోలేషన్ సెంటర్ లో చేరాడు.

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కరోనా సోకిన ఓ వ్యక్తి హల్చల్ చేశారు. తిమ్మానగర్ కు చెందిన నారాయణ కరోనా సోకి ఏరియా ఆసుపత్రి ఐసోలేషన్ సెంటర్ లో చేరాడు. మద్యం తాగే అలవాటు ఉన్న నారాయణ ఐసోలేషన్ సెంటర్ నుంచి పారిపోయాడు. మరో కాలనీలో ప్రత్యక్షం అవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పురపాలక సిబ్బంది పోలీసులకు సమాచారమిచ్చారు. ఐసోలేషన్ సెంటర్ కి వెళ్లేందుకు ససేమిరా అన్న నారాయణకు కల్లు ప్యాకెట్లు ఇవ్వడంతో శాంతించాడు. అనంతరం ఆయనను 108 వాహనంలో ఐసోలేషన్ సెంటర్ కు తరలించారు.


Tags

Read MoreRead Less
Next Story