తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్‌..!

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపిస్తున్న కరోనా వైరస్‌..!
X
కరోనా విలయం మళ్లీ ఆర్థిక పరిస్థితుల్ని తలకిందులు చేస్తోంది. రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలతో చాలా చోట్ల దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు.. ఏడున్నర- 8 గంటలకే మూతపడుతున్నాయి.

కరోనా విలయం మళ్లీ ఆర్థిక పరిస్థితుల్ని తలకిందులు చేస్తోంది. రాత్రిపూట కర్ఫ్యూ ఆంక్షలతో చాలా చోట్ల దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాలు.. ఏడున్నర- 8 గంటలకే మూతపడుతున్నాయి. పీక్‌టైమ్‌లో బిజినెస్‌ నడవక వ్యాపారులు నష్టపోతుంటే.. ఆ మేరకు GST వసూళ్లు, ఇతరత్రా ఆదాయం ఆగిపోయి.. ఆ ప్రభావం సర్కారు ఖజానాపై కూడా పడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ఈ నెలలో 1500 కోట్లకుపైగా ఆదాయం తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రతి నెలా ప్రభుత్వానికి 12 వేల కోట్ల ఆదాయం ఉంటుంది. ఇందులో దాదాపు 8 వేల కోట్లు రాష్ట్రంలోని వివిధ పన్నుల రూపంలో ఉంటుంది. ఎక్సైజ్ ట్యాక్స్ కావచ్చు, కమర్షియల్ ట్యాక్స్ కావచ్చు, ఇతరత్రా ఆదాయ మార్గాల్లో ఈ 8 వేల కోట్లు వస్తాయి. మిగతా నాలుగువేల కోట్లు కేంద్ర పన్నులు, అప్పులు, ఇతరత్రా నిధుల సమీకరణ రూపంలో ఉంటుంది. ఈసారి కర్ఫ్యూ, ఆంక్షల కారణంగా ఆదాయంలో 1500 కోట్లు తగ్గితే ఆ ప్రభావం వివిధ రకాల చెల్లింపులపై స్పష్టంగా పడేలా కనిపిస్తోంది. అందుకే ముందుజాగ్రత్తగా అత్యవసర అవసరాలకు తప్ప మిగతా వాటిని హోల్డ్‌లో పెడుతున్నారు.

జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, వివిధ ముఖ్యమైన రంగాలకు మాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటూ మిగతా బిల్లులు, కేటాయింపులకు తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నారు. ఇటీవలే CM రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన 30 శాతం ఫిట్‌మెంట్ హామీ అమలు కూడా ఈ కరోనా ఎఫెక్ట్‌తో ఆలస్యం అయ్యేలా ఉంది. పెంచిన జీతం అమలు తాత్కాలికంగా వాయిదా వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ నెలతోపాటు మేలోనూ ఇలాంటి పరిస్థితులే కొనసాగే అవకాశాలు ఉండండతో మొత్తంగా 3 వేల కోట్ల రూపాయల వరకూ రెవెన్యూ తగ్గుదల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మరోవైపు మే1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం దాదాపు 2 వేల 500కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. ప్రస్తుతం వ్యాక్సినే అత్యంత ప్రాధాన్య అంశం కాబట్టి కేటాయింపుల విషయంలో ఇబ్బంది లేకుండా చూసుకుంటూ.. మిగతా వాటికి ఆంక్షలు పెడుతున్నారు.

Tags

Next Story