విద్యార్థులే టార్గెట్‌గా స్కూళ్లలో విస్తరిస్తున్న వైరస్

విద్యార్థులే టార్గెట్‌గా స్కూళ్లలో విస్తరిస్తున్న వైరస్
గత నాలుగు రోజులుగా వందకు పైగా కేసులు స్కూళ్లలోనే వెలుగుచూశాయి.

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులే టార్గెట్‌గా స్కూళ్లలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా వందకు పైగా కేసులు స్కూళ్లలోనే వెలుగుచూశాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అటు పాఠశాలల్లో కరోనా వ్యాప్తిపై ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు చేపట్టింది. మరోవైపు ఈనెల 26న తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. అయితే సమావేశాలను త్వరగా ముగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో కరోనా ఉధృతి లేకపోయినప్పటికీ.. ముందు జాగ్రత్తగా కట్టడి చర్యలను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అటు స్కూళ్లలో కరోనా వ్యాప్తిపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని సమాచారం.

ఇక శనివారం కొత్తగా 394 కరోనా కేసులు నమోదు కాగా కరోనా వైరస్‌తో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో 3 లక్షల 3వేలకు పైగా కరోనా కేసులు చేరగా.. వైరస్‌తో 1,669 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 2వేల 804 యాక్టివ్ కేసులు ఉండగా 2 లక్షల 98వేల మంది రికవరీ అయ్యారు. అత్యధికంగా జీహెచ్ఎంసీలో 81, రంగారెడ్డి 64, మేడ్చల్‌లో 34 కరోనా కేసులు నమోదయ్యయి.



Tags

Read MoreRead Less
Next Story