palamuru TRS : పాలమూరు టీఆర్ఎస్ లో ఇంటిపోరు రచ్చకెక్కిందా?

palamuru TRS : పాలమూరు టీఆర్ఎస్ లో ఇంటిపోరు రచ్చకెక్కిందా?
palamuru TRS : పాలమూరు టీఆర్ఎస్ లో ఇంటిపోరు రచ్చకెక్కిందా? మంత్రిపైనే ఒక కౌన్సిలర్ తిరుగుబాటు చేయడానికి కారణమేంటి?

palamuru TRS : పాలమూరు టీఆర్ఎస్ లో ఇంటిపోరు రచ్చకెక్కిందా? మంత్రిపైనే ఒక కౌన్సిలర్ తిరుగుబాటు చేయడానికి కారణమేంటి? ఆ కౌన్సిలర్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి ఎందుకు వెళ్లింది? పార్టీ అధిష్ఠానం... కౌన్సిలర్ ను సస్పెండ్ చేసిన తర్వాత జరిగిన పరిణామాలేంటి? ఇంతకీ ఓ మంత్రికి... ఒక కౌన్సిలర్ కు మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరడం వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి?

పాలమూరులో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీ టిఆర్ఎస్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలు హాట్ టాపిక్ అయ్యాయి. రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో తనకు ప్రాణహాని ఉందంటూ అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీలో అలజడి రేగింది.

మహబూబ్ నగర్ పట్టణ రాజకీయాల్లో బురుజు సుధాకర్ రెడ్డి సీనియర్ నాయకుడు. 2014 వరకూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన ఆయన రెండు సార్లు కౌన్సిలర్ గా గెలిచారు. తర్వాత జరిగిన పరిణామాలతో ఆయన అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడోసారి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు.

టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుంచి మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో సఖ్యతగానే ఉన్నారు. కానీ మూడోసారి గెలిచిన తర్వాత మున్సిపల్ చైర్మన్ పదవిని ఆశించి భంగపడ్డారు. అప్పటి నుంచి పార్టీతో అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుధాకర్ రెడ్డిపై 15 రోజుల క్రితం దొంగనోట్ల మార్పిడి వ్యవహారంలో ఒకటి, తన వార్డు పరిధిలోని ఓటర్లను డబ్బుల కోసం బెదిరిస్తున్నాడంటూ మరో కేసు నమోదయ్యాయి. దీంతో ఆయనను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు పోలీసులు.

దీనంతటికీ కారణం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అని సుధాకర్ రెడ్డి భావించినట్లు సమాచారం. అందుకే బెయిలుపై బయటికి వచ్చిన తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ భూ కబ్జాలకు పాల్పడుతున్నట్లు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. అయితే హైదరాబాద్ లో ఆయన హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన కొన్ని నిమిషాల్లోనే... కౌన్సిలర్ తన వార్డులోని ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా చేశాడంటూ లోక్ అదాలత్ కు ఫిర్యాదు వెళ్లింది. అధికార రెవెన్యూ యంత్రాంగం చకచక స్థలాన్ని పరిశీలించడం... కౌన్సిలర్ పై కేసు నమోదు కావడం... వెనువెంటనే కౌన్సిలర్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు ప్రకటించడం జరిగిపోయాయి.

మహబూబ్ నగర్ పట్టణంలో టిఆర్ఎస్ పార్టీలో 2014 నుంచి ఎలాంటి అసమ్మతి లేదు. మొదటిసారి కౌన్సిలర్ ఏకంగా మంత్రిపై ధ్వజమెత్తడం... ఫిర్యాదు చేయడంతో పాలిటిక్స్ వేడెక్కాయి. నాలుగు నెలల క్రితం కొందరు పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, నాయకులు పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న మంత్రి, ముఖ్య నాయకులుకలసి అందరినీ బుజ్జగించారు. దీంతో ఎవరూ పార్టీని వీడలేదు. అలాంటిది ఇప్పుడు అధికార పార్టీకి చెందిన కౌన్సిలరే మంత్రిపై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

150 రూపాయల జీతంతో చిన్న ఉద్యోగి కెరీర్ మొదలు పెట్టిన శ్రీనివాస్ గౌడ్... ఇప్పుడు వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారు, భూ కబ్జాలకు పాల్పడుతున్నారని మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీలోనూ దీనిపై చర్చ నడుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా మంత్రి ఆస్తులపై పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story