కరోనా ఎఫెక్ట్.. దంపతులు ఆత్మహత్య

కరోనా ఎఫెక్ట్.. దంపతులు ఆత్మహత్య
X

జగిత్యాలలో దంపతుల ఆత్మహత్య కలకలం రేపింది. శివ వీధిలో నివాసం ఉండే దంపతులు 49 ఏళ్ల గంజి రాంబాబు 47 ఏళ్ల లావణ్య ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరోనా ఎఫెక్ట్.. ఆర్థిక సమస్యలే వారి బలవన్మరణానికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు. ముంబైలో ఓ యాడ్ ఏజెన్సీలో దంపతులిద్దరూ పని చేస్తున్నారు. అయితే పది నెలల క్రితం తన తండ్రి రాజేశం అనారోగ్యంతో మృతి చెందడంతో జగిత్యాలకు వచ్చాడు రాంబాబు. తరువాత కరనో టెస్టులు చేయించుకోగా దంపతులు ఇద్దరికీ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.. దీంతో ఉపాధి కోల్పోయారు. అటు సంతానం లేకపోవడం.. ఇటు ఉపాధి పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్టు తెలుస్తోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురై.. ఇంటిని విక్రయించే క్రమంలో సోదరులతో వివాదం మరింత కృంగదీశాలా చేసింది. సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముట్టినట్టు అనిపించి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story