Chevella: దారుణం.. మూడు నెలల చిన్నారికి ఉరివేసి.. భార్యాభర్తలు కూడా..

Chevella: దారుణం.. మూడు నెలల చిన్నారికి ఉరివేసి.. భార్యాభర్తలు కూడా..
X
Chevella: ఏం కష్టం వచ్చిందో.. ముక్కుపచ్చలారని మూడు నెలల చిన్నారికి ఉరివేసి, అటుపిమ్మట దంపతులు కూడా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చోటు చేసుకుంది.

Chevella: ఏం కష్టం వచ్చిందో.. ముక్కుపచ్చలారని మూడు నెలల చిన్నారికి ఉరివేసి, అటుపిమ్మట దంపతులు కూడా ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో చోటు చేసుకుంది. దేవరపల్లికి చెందిన అశోక్ (30)కు ఏడాదిన్నర క్రితం అంకిత (20) తో వివాహం జరిగింది. అశోక్ సోదరి నిశ్చితార్థం ఉండడంతో అంకిత పాపను తీసుకుని దేవరపల్లి వచ్చింది. తమ్ముడు రాఘవేంద్రతో కలిసి ఆటోలో కూరగాయలను మార్కెట్‌కు తీసుకు వెళ్లాడు అశోక్. తిరిగి తెల్లవారు జామున 4 గంటలకు ఇంటికి వచ్చారు. వచ్చేటప్పుడు వెంట తెచ్చుకున్న బిర్యానీ తిన్నారు. అనంతరం తమ్ముడు తన ఇంటికి వెళ్లిపోయాడు..

ఆ తరువాత టీవీ ఎక్కువ సౌండ్ పెట్టి చిన్నారికి ఉరి వేశాడు.. ఆ తర్వాత భార్యభర్తలు కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు. తెల్లవారు జామున టీవీ ఎక్కువ సౌండ్‌తో మోగుతుండే సరికి అనుమానం వచ్చిన ఇరుగు పొరుగు ఇళ్ల వాళ్లు వచ్చి తలుపు కొట్టారు. ఎంతకూ తీయకపోవడంతో గొళ్లెం విరగ్గొట్టి లోపలికి వెళ్లి చూడగా చిన్నారి, అంకిత అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. అశోక్ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.. స్థానికులు గమనించి వెంటనే అతడిని కిందికి దించారు. కానీ అతడి ఊపిరి కూడా ఆగిపోయింది. పోలీసులకు సమాచారం అందడంతో మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Next Story