Shilpa Chowdary: శిల్పా చౌదరికి 14 రోజుల రిమాండ్..

Shilpa Chowdary (tv5news.in)
Shilpa Chowdary: శిల్పాచౌదరికి ఉప్పర్‌పల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం శిల్పా చౌదరిని ఒక్క రోజు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. దర్యాప్తులో భాగంగా కోకాపేట యాక్సిస్ బ్యాంకులో శిల్ప అకౌంట్‌లో జరిగిన లావాదేవీలను పరిశీలించారు పోలీసులు. బ్యాంక్ లాకర్‌లో ఏమీ లభించకపోవడంతో శిల్పచౌదరిని తిరిగి నార్సింగి ఎస్ఓటీ కార్యాలయానికి తీసుకెళ్లారు.
పలువురు వ్యక్తుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శిల్పా.. వాటిని ఎక్కడికి మళ్లించిందనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. శిల్పా పక్కా ప్రణాళికతో కోట్లు వసూలు చేసి మోసం చేసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకవేళ మోసం బయటపడినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
దీంతో శిల్ప, ఆమె భర్త శ్రీనివాస్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు పోలీసులు. ఏడాది కాలంలో ఎక్కువగా ఎవరితో మాట్లాడారనే వివరాలను సేకరించే పనిలో పడ్డారు. అటు శిల్ప భర్త శ్రీనివాస్ ప్రసాద్‌పైనా ఫోకస్ పెట్టారు పోలీసులు. విచారణ కోసం రావాలని ఇప్పటికే పోలీసులు ఆదేశించారు కూడా. ఇద్దరూ కలిసి ఎలా ఆర్థిక నేరాలు చేశారు, ఎవరెవరితో లావాదేవీలు నడిపారనే కోణంలో శ్రీనివాస్‌ను ప్రశ్నించే అవకాశం ఉంది.
శిల్పా చౌదరి తమ దగ్గర నుంచి కోట్ల రూపాయలు తీసుకుందని, డబ్బు తిరిగివ్వాలని అడిగితే బెదిరిస్తోందని ముగ్గురు బాధితులు కంప్లైంట్ ఇచ్చారు. శిల్పా చౌదరితో ఎవరైనా గంటసేపు మాట్లాడితే చాలు ట్రాప్‌లో పడిపోతారని, తాను కూడా అలాగే మోసపోయానని రోహిణిరెడ్డి చెప్పింది. దీంతో హైప్రొఫైల్ వ్యక్తులను శిల్పా చౌదరి ఎలా ట్రాప్ చేసి డబ్బు దండుకుంటుందో పోలీసులకు క్లారిటీ వచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com