Covid - 19 : పెరుగుతున్న కరోనా కేసులు

Covid - 19 : పెరుగుతున్న కరోనా కేసులు
టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్ వంటి వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు

దేశంలో మళ్లీ కరోనా భయాలు మొదలయ్యాయి. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య శాఖ అలర్ట్ అయ్యింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులు, సంసిద్ధతపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్ వంటి వ్యూహాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఇక వ్యాక్సిన్లు ఆయా రాష్ట్రాలే సమకూర్చుకోవాలని కేంద్ర మంత్రి మాండవీయ తెలిపారు. బహిరంగా మార్కెట్లో పుష్కలంగా వ్యాక్సిన్ నిల్వలు ఉన్నాయని చెప్పారు.

ఇక తెలంగాణలో వైరస్ కట్టడి చేస్తున్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గనిర్ధేశంతో కరోనా కట్టడి, వ్యాక్సినేషన్లో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా పరిస్థితులు రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయని, ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ప్రికాషనరీ డోసులో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు చెప్పారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి వ్యాక్సిన్ల సరఫరా నిలిచిపోవడంతో రాష్ట్రంలో నిల్వలు లేకుండా పోయినట్లు చెప్పారు. దీంతో వ్యాక్సినేషన్ నిలిచిపోయిందన్నారు. రాష్ట్రానికి అవసరమైన వ్యాక్సిన్ డోసులను తక్షణం సరఫరా చేయాలని, ఈ విషయంలో ఇప్పటికే కేంద్రానికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం తమకు వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయిందని, దీంతో వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అంతరాయం కలుగుతున్నట్లు కేంద్ర మంత్రి దృష్టికి తెచ్చారు. వ్యాక్సిన్లను రాష్ట్రాలే సమకూర్చుకోవాలని కేంద్ర మంత్రి తెలిపారు.

Tags

Next Story