cp sajjanar : ఆన్‌లైన్ లోన్ యాప్స్ వెనక చైనా లింక్ : సీపీ సజ్జనార్

cp sajjanar : ఆన్‌లైన్ లోన్ యాప్స్ వెనక చైనా లింక్ ఉందని నిర్దారించారు సీపీ సజ్జనార్. ముఠాలో కీలక నిందితుడు చైనాకి చెందిన జియా జాంగ్ అని తేల్చారు. ప్రస్తుతం జియా జాంగ్ సింగపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. జియాతో పాటు కీలకంగా ఉన్న ఉమాపతి పరారీలో ఉన్నారు. గుర్గావ్ కేంద్రంగా ఈ మైక్రో ఫైనాన్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.
అంతేకాదు మేసేజ్‌ల ద్వారా లింక్స్ పంపించి అప్లికేషన్లను డౌన్ లోడ్ చేసుకునేలా చేసి పిల్లలను కూడా వేధిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని సీపీ చెప్పారు. అందుకే, 116 యాప్‌లను డిలీట్ చేయాల్సిందిగా గూగుల్ ప్లేస్టోర్‌కు లెటర్ రాస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ కాల్ మనీ కేసులో విచారణ ఇంకా కొనసాగుతుందని, వేధిస్తే వచ్చి కంప్లైంట్ చేయాలి తప్ప ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com