Narayana: విమాన సంస్థలపై నారాయణ ఫైర్..

విమాన టికెట్ల ధరలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన సంస్థలు ప్రయాణికులను దోచుకుంటున్నాయని ఫైర్ అయ్యారు. ఈ మేరకు తాజాగా ఆయన పౌర విమానయాన శాఖ కు లేఖ రాశారు. ప్రయాణ దూరం మారనప్పుడు టికెట్ ధరలు ఎలా పెంచుతారని నిలదీశారు. విమాన సంస్థలు ప్రజలను లూటీ చేస్తున్నారన్నారు. విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వస్తుంటే ఇంటెలిజెన్స్ విభాగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బాంబు బెదిరింపులపై ఇంటెలిజెన్స్ వైఫల్యం చెందిందని, దుండగులు సైకలాజికల్ టెర్రర్ కు గురి చేస్తున్నారు
భారత్ దేశ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్లైట్ టికెట్ ధరలు నిర్ణయించాలన్నారు. విమానయాన టికెట్ల రేట్లపై నియంత్రణ ఉండాలన్నారు. విమానయాన శాఖ ప్రజల కోసం పని చేయాలని చెప్పారు. విమానయాన టికెట్ల ధరలు ప్రజలకు అనుకూలంగా ఉండాలన్న ఆయన.. కార్పొరేట్ వ్యక్తులే కాదు సామాన్య మధ్య తరగతి ప్రజలు కూడా విమానాల్లో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నాయన్నారు. విమానాలకు బాంబు బెదిరింపులు రావడం ఇంటెలిజెన్స్ వైఫల్యమని ఆయన ఆరోపించారు. విమానయాన సంస్థల టికెట్లు ధరలను నియంత్రించకపోతే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అవుతుందన్నారు. ప్రపంచంలో హంగర్ ఇండెక్స్‌లో ఇండియా 112వ స్థానంలో ఉందన్నారు. ట్రైన్‌లో సహితం వందే భారత్ పేరిట టికెట్ల రేట్లు పెంచారని సీపీఐ నారాయణ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com