CPI Narayana Wife: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ భార్య కన్నుమూత..

X
CPI Narayana Wife: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు సతీ వియోగం కలిగింది. ఆయన భార్య వసుమతి దేవి కన్నుమూశారు. 67 ఏళ్ల వసుమతి దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజుల క్రితం ఆమెకు గుండెకు సంబంధించిన ఇబ్బంది రావడంతో వైద్యులు స్టెంట్ వేశారు. తిరుపతిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె.. ఈ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. వసుమతి దేవి గతంలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేశారు. ఈ విషాద వార్త విన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ సహా పలువురు ప్రముఖులు.. నారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వసుమతి దేవి అంత్యక్రియలు రేపు వారి స్వగ్రామం నగరి మండలం ఐనంబాకం గ్రామంలో నిర్వహించనున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
