పోలవరం ప్రాజెక్టు జగన్ అబ్బ సొత్తు కాదు : సీపీఐ నారాయణ

పోలవరం ప్రాజెక్టు జగన్ అబ్బ సొత్తు కాదు : సీపీఐ నారాయణ

పోలవరం ప్రాజెక్టు సీఎం జగన్ అబ్బ సొత్తు కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సీపీఐ నాయకులు పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేయడానికి వెళ్లడం లేదని.. సందర్శించడానికి మాత్రమే వెళ్తున్నారని తెలిపారు. అరెస్టులతో ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను భయపెట్టాలని చూస్తుందని.. ప్రభుత్వం బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. వామపక్ష నేతల అరెస్టులను ఖండిస్తూ తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం ముందు నారాయణ, వామపక్ష నేతలు రాస్తారోకో నిర్వహించారు.

Tags

Next Story