CPI Narayana: 12 మందిని అమిత్‌ షా హత్య చేయించారు: సీపీఐ నారాయణ

CPI Narayana: 12 మందిని అమిత్‌ షా హత్య చేయించారు: సీపీఐ నారాయణ
X
CPI Narayana: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై.. సీపీఐ జాతీయ అధ్యక్షుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

CPI Narayana: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాపై.. సీపీఐ జాతీయ అధ్యక్షుడు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మొట్టమొదటి దేశ ద్రోహి అమిత్‌ షా అన్నారు నారాయణ. క్రిమినల్‌ కేసుల నుంచి తాను బయట పడేందుకు 12 మందిని హత్య చేయించారని ఆయన ఆరోపించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో సీసీఐ 3వ రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశానికి హాజరైన నారాయణ.. నరేంద్ర మోదీ ఏడేళ్ల పాలనలో ఒక్క పబ్లిక్‌ సెక్టార్‌ ను కూడా ప్రారంభించక పోగా.. 23 సంస్థలను కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించారని మండి పడ్డారు. ఇక దేశాన్ని పాలించిన 14 మంది ప్రధానులు 42 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. మోదీ ఏడేళ్లలో 82లక్షల కోట్లు అప్పులు చేశారంటూ విమర్శించారు. ఇక దేశ సంపదను అంబానీ, ఆదానీలకు కట్టబెట్టారన్నారు.

Tags

Next Story