CPM : తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను తొక్కిపెడుతున్నారు : సీతారాం ఏచూరి

CPM : తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను తొక్కిపెడుతున్నారు : సీతారాం ఏచూరి
X
CPM : తెలంగాణ సాయుధ చరిత్రను తొక్కి పెడుతున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్వి సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు

CPM : తెలంగాణ సాయుధ చరిత్రను తొక్కి పెడుతున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్వి సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ నుంచి ఇప్పటి వరకు అందరూ దాచిపేడుతున్నారని విమర్శించారు. చరిత్రను బీజేపీ తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. లౌకిక శక్తులు ఏకం కావాలని సీతారా ఏచూరి పిలుపునిచ్చారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించడం అనివార్యం అయిందన్నారాయన. కమ్యూనిస్టుల ఐక్యతకి చర్చలు జరుగుతున్నాయని.. విజయవాడ సీపీఐ మహాసభకి తాను వెళ్తున్నట్లు సీతారాం ఏచూరి వెల్లడించారు.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని తప్పుదారి పట్టించారని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. అధికార పార్టీ కూడా అలానే చేసిందని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. బీజేపీ మతపరమైన అంశంగా చిత్రీకరించే కుట్ర చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయుధ పోరాటాన్ని రెండు మతాల మధ్య యుద్ధంగా చూడకూడదన్నారు.

Tags

Next Story