Telangana: రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణా కార్యక్రమాలు

Telangana: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణా కార్యక్రమాలు చేపట్టింది. మేడ్చల్‌లో సీపీఆర్ శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. గుండె సడెన్‌గా ఆగిపోతే ఏం చేయాలి అనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి స్వయంగా సీపీఆర్ చేసి చూపించారు.
సీపీఆర్‌కు మరింత ప్రాధాన్యత కల్పిస్తాం - కేటీఆర్
తెలంగాణను దేశానికే ఆదర్శవంతం చేయాలి - కేటీఆర్
సీపీఆర్ ట్రైనింగ్ ఆలోచన కేటీఆర్‌దే - హరీష్‌రావు
సడన్ కార్డియాక్ అరెస్ట్‌కు చిన్నా పెద్దా తేడా లేదు - హరీష్‌రావు
సంవత్సరానికి 15లక్షల మంది సడన్ కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోతున్నారు - హరీష్‌రావు
సీపీఆర్ చేయగలిగితే ప్రతి 10మందిలో ఐదుగురిని బ్రతికించుకోవచ్చు - హరీష్‌రావు
సీపీఆర్ చేయడానికి విద్యార్హత అవసరం లేదు - హరీష్‌రావు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com