కుప్పకూలిన విమానం.. శిక్షణలో ఉన్న ఇద్దరు పైలెట్లు మృతి

తెలంగాణాలోని దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శిక్షణలో ఉన్న పిలాటస్ ట్రైనర్ విమానం కుప్ప కూలింది. దీంతో ఇద్దరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) పైలట్లు మరణించారు. పైలట్‌లలో ఒక బోధకుడు, ఒక క్యాడెట్ ఉన్నారని అధికారులు తెలిపారు.
"ఒక Pilatus PC 7 Mk Il ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఈరోజు ఉదయం AFA సాధారణ శిక్షణ సమయంలో ప్రమాదానికి గురైంది. విమానంలో ఉన్న పైలట్‌లిద్దరూ ప్రాణాపాయానికి గురయ్యారని IAF వారి మరణాన్ని ధృవీకరిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది".
పైలట్ల మృతికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం తెలిపారు. "హైదరాబాద్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదం నన్ను కలచి వేసింది. ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఈ విషాద సమయంలో, నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి" అని మైక్రోబ్లాగింగ్ సైట్‌లో మంత్రి పేర్కొన్నారు.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com