Crime: మూడుచింతలపల్లిలో కాల్పుల కలకలం

హైదరాబాద్ శివార్లలో కాల్పులు కలకలం రేపాయి. తుపాకీతో బెదిరించి 2లక్షల నగదు అపహరించారు దుండగులు. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రిలో మద్యం దుకాణం వద్దకు మాస్క్‌లు ధరించి ముగ్గురు దుండగులు వచ్చారు. క్యాషియర్‌తో పాటు మరో ఇద్దరిపై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. మద్యం దుకాణం సిబ్బంది తిరగబడడంతో తుపాకీతో కాల్పులు జరిపారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పి తూటా షట్టర్‌కు తగిలింది.
ఆ తర్వాత డబ్బులతో పరారవుతుండగా సిబ్బంది కేకలు వేశారు దీంతో పారిపోతున్న నిందితులు గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. వెంటనే దుకాణ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్పాట్‌ను పరిశీలించిన ఏసీపీ రామలింగరాజు ఐదు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com