Crime: చిక్కడపల్లిలో అగ్నిప్రమాదం

Crime: చిక్కడపల్లిలో అగ్నిప్రమాదం
సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే మరో ఘటన

సికింద్రాబాద్ అగ్నిప్రమాద ఘటన మరువక ముందే హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుఝామున చిక్కడపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విఎస్టీ వద్ద అన్నపూర్ణ బార్ సమీపంలోని డెకరేషన్ గోదాంలో మంటలు చెలరేగాయి. ఆతర్వాత వరుసగా ఆపిల్ బిగ్ లైఫ్, సుగుణ మెటల్స్ గోదాములకు మంటలు వ్యాపించాయి. కేబుల్ వైర్స్, ప్లాస్టిక్ మెటిరియల్‌కు నిప్పు అంటుకుంది. ఆ తర్వాత ఒక్కసారిగా దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడ్డాయి. అంతకంతకూ మంటలు వ్యాపిస్తుండటంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు అన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిప్రమాద జరిగిన గోదాంను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పరిశీలించారు. పోలీసులు, ఫైర్ సిబ్బందిని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తలు పాటించని వ్యాపారులు, గోదాం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని అన్నారు.

Tags

Next Story