Crime: తిరుపతమ్మ జాతరలో ఉద్రిక్తత.. కత్తితో దాడి

Crime: తిరుపతమ్మ జాతరలో ఉద్రిక్తత.. కత్తితో దాడి
X
ఊరేగింపులో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తిని కత్తితో పొడవగా పలువురికి గాయాలు

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం, తమ్మారంలో ఉద్రిక్తత నెలకొంది. గత కొంతకాలంగా బీఅర్‌ఎస్ పార్టీ స్ధానిక సర్పంచ్ నర్సిరెడ్డి, ఎంపీటీసీ మోహన్ రెడ్డి రెండు వర్గాలుగా విడిపోయారు. బుధవారం తిరుపతమ్మ జాతర సందర్భంగా వీరిమధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. జాతరలో అమ్మవారి ఊరేగింపులో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తిని కత్తితో పొడవగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు జోక్యం చేసుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనలో పోలీసుల తీరును నిరసిస్తూ పలువురు ధర్నా చేపట్టారు.

Tags

Next Story