Crime: ఆగిన మరో యువగుండె

Crime: ఆగిన మరో యువగుండె
రిసెప్షన్ లో సరదగా డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు

అప్పటి వరకు నవ్వుతూ,సరదగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అందరితో కలివిడిగా ఉన్నవారు అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం లోని పార్డి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం బైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది.పెళ్లి రిసెప్షన్ లో ముత్యం అనే యువకుడు పెళ్లి వేడుకకు హాజరయ్యాడు‌‌. రాత్రి రిసెప్షన్ లో సరదగా డ్యాన్స్ చేశాడు. చేస్తున్న వ్యక్తి చేస్తున్నట్లుగానే కుప్పకూలిపోయాడు.

కుటుంబ సభ్యులు ముత్యంను బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే యువకుడు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. అప్పటి వరకు సరదాగా గడిపిన వ్యక్తి అలా చనిపోవడంతో వివాహానికి హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. దీనంతటినీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వీడియోగా తీశారు దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story