Crime: ప్రీతి ఘటన మరువకముందే మరో దారుణం

Crime: ప్రీతి ఘటన మరువకముందే మరో దారుణం
X
వరంగల్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో ర్యాగింగ్‌ వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య

మెడికో స్టూడెంట్‌ ప్రీతి ఘటన మరువకముందే వరంగల్‌లో మరో దారుణం జరిగింది. నర్సంపేటలోని జయముఖీ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో ర్యాగింగ్‌ కలకలం రేగింది. స్టూడెంట్‌ రాహుల్‌ వేధింపులతో ఓ విద్యార్థిని సూసైడ్‌ చేసుకుంది. ఇంజనీరింగ్‌ థర్డ్ ఇయర్‌ చదువుతున్న రక్షిత తన బాబాయ్‌ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రక్షిత డెడ్‌బాడీని MGM ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం జయశంకర్‌ భూపాలపల్లిలో అంత్యక్రియలు చేయనున్నారు. అయితే గత రెండు రోజుల క్రితం రక్షిత మిస్సింగ్‌ అయినట్లు కేసు నమోదైంది.ఇక గతంలో ర్యాగింగ్‌పై రక్షిత యాజమాన్యానికి ఫిర్యాదు చేసినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story