Crime: కేశవరెడ్డి పాఠశాలలో విద్యార్థి మృతి కలకలం

Crime: కేశవరెడ్డి పాఠశాలలో విద్యార్థి మృతి కలకలం
X
ఉపాధ్యాయుడు కొట్టడం వల్లే కార్తీక్ మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆందోళన

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చిలాపూర్‌ సమీపంలోని కేశవరెడ్డి పాఠశాలలో ఓ విద్యార్థి మృతి కలకలం రేపుతోంది. మూడో తరగతి చదువుతున్న కార్తీక్‌ అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ కార్తీక్ మృతి చెందాడు. ఉపాధ్యాయుడు కొట్టడం వల్లే కార్తీక్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు.ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాలుడి స్వస్థలం మొయినాబాద్‌ మండలం పెద్ద మంగళారంగా పోలీసులు తెలిపారు.

Tags

Next Story