Crime: అరవై తులాల అక్రమ బంగారం పట్టివేత

Crime: అరవై తులాల అక్రమ బంగారం పట్టివేత
దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు అనుమతి లేకుండా ఆరు వందల గ్రాముల బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తి గుట్టు రట్టు

విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ఓ స్మగ్లర్‌ వేసిన ప్లాన్‌ అట్టర్‌ ప్లాప్‌ అయింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు అనుమతి లేకుండా ఆరు వందల గ్రాముల బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తి గుట్టు రట్టు చేశారు CISF అధికారులు. గోల్డ్ ను బేరింగ్‌లుగా మార్చి తీసుకువచ్చాడు.. కస్టమ్స్‌ అధికారుల కన్నుగప్పి బయటకు కూడా వచ్చేశాడు అయితే CISF ఇంటిలిజెన్స్‌ అధికారుల నిఘా నించి తప్పించుకోలేకపోయాడు తాను తెచ్చిన గోల్డ్‌ను చేతులు మార్చుతుండగా మెరుపు దాడి చేసిన అధికారులు స్మగ్లర్‌ను పట్టుకొని కస్టమ్స్‌ అధికారులకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story