Crime: నవీన్ హత్య కేసులో ప్రియురాలితో పాటు హసన్ అరెస్ట్

హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ హత్య కేసులో మరో ఇద్దరు నిందితులకు హయత్ నగర్ కోర్టు రిమాండ్ విధించింది. నిందితుడు హరిహరకృష్ణకు సహకరించారనే కారణంతో ప్రియురాలు నిహారికతో పాటు స్నేహితుడు హసన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరు పరిచారు. విచారించిన న్యాయ స్థానం ఇద్దరికి 14 రోజు రిమాండ్ విధించింది.
గతనెల 17న నవీన్‌ను.. హరిహరకృష్ణ అబ్దుల్లాపూర్ మెట్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత హత్య చేసి తల, గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలు శరీరం నుండి వేరు చేసి వాటిని సంచిలో వేసుకుని ద్విచక్రవాహనంపై బ్రహ్మణపల్లిలోని హాసన్ ఇంటికి వెళ్లాడు. హసన్‌తో కలిసి హరిహరకృష్ణ, శరీర అవయవాలను మన్నెగూడ పరిసరాల్లో పడేశాడు. తిరిగి హసన్ ఇంటికి చేరుకుని డ్రెస్ మార్చుకుని రాత్రి అక్కడే ఉన్నాడు.
హత్య చేసిన మరుసటి రోజు ఉదయం బీఎన్ రెడ్డి నగర్‌లో ఉండే ప్రియురాలు నిహారిక వద్దకు హరిహరకృష్ణ వెళ్లాడు. ఆమెకు నవీన్‌ను హత్య చేసిన విషయం తెలిపాడు. ఆమె వద్ద 15వందల రూపాయలు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఫోన్‌లో నిహారిక, హాసన్‌తో సంప్రదింపులు జరిపాడు. 20వ తేదీ సాయంత్రం మరోసారి యువతి వద్దకు వెళ్లి ఆమెను బైక్‌పై ఎక్కించుకొని నవీన్‌ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. దూరం నుంచి నవీన్ మృతదేహాన్ని చూపించాడు. ఆ తర్వాత యువతిని ఇంటి వద్ద వదిలేసి వెళ్లాడు. 21వ తేదీ నవీన్ కుటుంబ సభ్యులు హరిహరకృష్ణకు ఫోన్ చేసి ఆచూకీ గురించి ఆరా తీయడంతో హత్య విషయం బయటపడుతుందనే భయంతో పారిపోయాడని పోలీసులు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com