Crime: ఆగిన మరో యువ గుండె

X
By - Subba Reddy |22 March 2023 8:30 AM IST
క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి
గతకొన్ని రోజులుగా యువతలో గుండెపోటు మరణాలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఉన్నట్టుండీ ఓకే సారి కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. గొర్రెపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి విష్ణు(30) అనే యువకుడు మండల కేంద్రంలో జరుగుతున్న క్రికెట్ టౌర్నమెంట్‌లో పాల్గొన్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్ ఆడేందుకు క్రీస్‌లోకి అడుగుపెట్టిన విష్ణు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా నేలకొరిగాడు. గమనించిన తోటి ఆటగాళ్లు అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం మెట్‌పల్లి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విష్ణు మృతిచెందాడని వైద్యులు దృవీకరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com