CRIME: భర్తలా...యమదూతలా...

భార్యలను అతి కిరాతకంగా చంపుతున్న భర్తల కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కుక్కర్ కేసును మర్చిపోకముందే అలాంటి ఘటనే మరొకటి జరగడం తీవ్ర సంచలనం రేపడంతోపాటు మరోసారి చర్చకు దారి తీసింది. దేశంలో పెరుగుతున్న నేర ప్రవృత్తికి ఈ దారుణాలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రేమించానని బాసలు చెప్పి... కలకాలం బాగా చూసుకుంటానని ఒట్లు పెట్టి...పెళ్లి చేసుకుంటున్న భర్తలు.. భార్యలను దారుణాతి దారుణంగా చంపేస్తున్నారు. క్షణికావేశంలో కాదు.. పక్కా ప్లాన్‌తో కట్టుకున్నవాళ్లను చంపేస్తున్నారు కొందరు మృగాళ్లు. ఇటీవల ఇలాంటి కేసులు ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్‌లో.. ప్రేమించి, పెద్దలను ఎదురించి కులాంతర వివాహం చేసుకున్న మహేందర్ రెడ్డి అనే యువకుడు.. భార్య స్వాతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. అనుమానంతో అతడి ప్రేమ మొత్తం చివరికి ద్వేషంలా మారింది. వరంగల్‌లో.. కట్నం కోసం భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. మహబూబ్‌నగర్‌లో.. భార్యను కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఇవన్నీ తెలంగాణలో గత కొన్ని రోజులుగా భార్యలపై భర్తలు చేసిన దారుణాలు.
హైదరాబాద్‌లో.. ప్రేమించి, పెద్దలను ఎదురించి కులాంతర వివాహం చేసుకున్న మహేందర్ రెడ్డి అనే యువకుడు.. భార్య స్వాతిని అతి కిరాతకంగా హత్య చేశాడు. అనుమానంతో అతడి ప్రేమ మొత్తం చివరికి ద్వేషంలా మారింది. వరంగల్‌లో.. కట్నం కోసం భార్యను దారుణంగా హత్య చేశాడో భర్త. మహబూబ్‌నగర్‌లో.. భార్యను కత్తితో పొడిచి చంపి, మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఇవన్నీ తెలంగాణలో గత కొన్ని రోజులుగా భార్యలపై భర్తలు చేసిన దారుణాలు. పెద్దలంటే గౌరవం, చట్టం మీద భయం లేకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు. తన జీవితం, పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అనే కనీస ఆలోచన కూడా లేకుండా ఎంతకైనా తెగించేస్తున్నారు. ట్టాలు.. న్యాయం చేయవనే అభద్రతా భావమో, వ్యవస్థల మీద నమ్మకం లేకనో, సమాజం మద్దతు ఇవ్వదని అపనమ్మకమో.. కానీ ఎంతటి దారుణాలకైనా తెగిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com