3 పెళ్లిళ్లు, ముగ్గురితో సహజీవనం, 256 నేరాలు..32 సార్లు జైలు శిక్ష..

3 పెళ్లిళ్లు, ముగ్గురితో సహజీవనం, 256 నేరాలు..32 సార్లు జైలు శిక్ష..
X
మంత్రి శంకర్.. కరడు కట్టిన ఘరానా దొంగ.. వయసు 60 ఏళ్ళు.. 20 ఏళ్ల నుంచే దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. 256 నేరాలు, 32 సార్లు జైలు శిక్ష, నాలుగుసార్లు పీడీ యాక్ట్ .. ఇది మనోడి ట్రాక్ రికార్డు.

మంత్రి శంకర్.. కరడు కట్టిన ఘరానా దొంగ.. వయసు 60 ఏళ్ళు.. 20 ఏళ్ల నుంచే దొంగతనాలు చేయడం మొదలు పెట్టాడు. 256 నేరాలు, 32 సార్లు జైలు శిక్ష, నాలుగుసార్లు పీడీ యాక్ట్ .. ఇది మనోడి ట్రాక్ రికార్డు. ఎన్నిసార్లు జైలుకు వెళ్ళిన బుద్ది మారలేదు. దాదాపుగా అన్నీ పోలిస్ స్టేషన్ లలో శంకర్ సుపరిచితుడే .. తాజాగా మరోసారి దొంగతనం కేసులో పోలీసులకి దొరికిపోయి అరెస్ట్ అయ్యాడు.

గతంలో ఓ కేసులో జైలుకి వెళ్లి ఈ నెల 04న బయటకు వచ్చిన శంకర్ ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని ఈ నెల 11 న రాత్రి బేగంపేటలో తాళాలు వేసి ఉన్న ఇంట్లోకి వరుస చోరీలకి పాల్పడ్డాడు. మొత్తం ఐదు ఇళ్ళలో సోదాచేయగా, రెండు ఇళ్ళల్లో మాత్రం బంగారం, డబ్బును ఎత్తుకెళ్ళాడు. అయితే ఈ చోరీలపైన బేగంపేటలో కేసులు నమోదు కావడంతో రంగంలోకి దిగిన నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శంకర్ తో పాటుగా అతనికి సహకరించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.12 లక్షల నగదుతో పాటు బంగారం, వాహనాలు, చోరీకి వాడే వస్తువులు స్వాదీనం చేసుకున్నారు.

అనంతరం పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం మీడియాకు మంత్రి శంకర్ నేరాల చిట్టాను బయటపెట్టారు. 1979లో సైకిళ్ల దొంగతనంతో నేరచరిత్రను మొదలు పెట్టిన శంకర్ ఆ తర్వాత గజదొంగగా మారాడు. అలా పలు కేసుల్లో జైలుకి వెళ్ళిన శంకర్ కి అక్కడ కొందరు నేరస్తులు పరిచయం అయ్యారు .. వారిదగ్గర తాళం ఎలా పగులకొట్టాలో నేర్చుకున్నాడు. అక్కడే మరికొందరిని తన అసిస్టెంట్లుగా ఏర్పాటు చేసుకున్నాడు.

అలా దొంగతనాల్లో బాగా అనుభవం సంపాదించాడు. ఎక్కడైనా తాళం వేసి ఉన్న ఇల్లు కనిపిస్తే చాలు నిమిషాల్లో పని పూర్తి చేసుకుని వచ్చేవాడు. అయితే పోలీసులకి చిక్కకుండా ఉండేందుకు వరుసగా మూడు రోజుల పాటు ఒకే ప్లేస్ లో ఉండేవాడు కాదు.. వరుసగా ప్లేస్ లు మారుస్తూ ఉండేవాడు. దొంగతనం చేసిన డబ్బులతో బాగా ఎంజాయ్ చేసేవాడు. మంత్రి శంకర్ కి ముగ్గురు భార్యలు, ఆరుగురు సంతానం ఉన్నారు. వీరు సరిపోరు అన్నట్టుగా మరో ముగ్గురు యువతులతో సహజీవనం కూడా చేస్తున్నాడు.

Tags

Next Story