తెలంగాణ

వారాంతపు లాక్‌డౌన్‌పై హైకోర్టు ఆదేశాల్ని పరిశీలిస్తాం : సోమేష్‌ ‌కుమార్‌

తెలంగాణలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ తెలిపారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు.

వారాంతపు లాక్‌డౌన్‌పై హైకోర్టు ఆదేశాల్ని పరిశీలిస్తాం :  సోమేష్‌ ‌కుమార్‌
X

తెలంగాణలో కరోనా పరిస్థితి అదుపులోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌ తెలిపారు. కొవిడ్‌ వ్యాప్తి నివారణకు వైద్యులు, సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారని చెప్పారు. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని.. ఇది మంచి పరిణామమని అన్నారు. తెలంగాణలో కరోనా కట్టడి చర్యలపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాచరణపై సోమేష్‌ కుమార్‌... బీఆర్కే భవన్‌లో వివరాలు వెల్లడించారు.

వారాంతపు లాక్‌డౌన్‌పై హైకోర్టు ఆదేశాల్ని పరిశీలిస్తాం : సోమేష్‌ ‌కుమార్‌తెలిపారు. కరోనా సమస్యకు లాక్‌డౌన్‌ పరిష్కారం కాదని అన్నారు. లాక్‌డౌన్‌తో పెద్దగా ఉపయోగం ఉండదని జీవనోపాధి దెబ్బతింటుందని చెప్పారు. అవసరమైనపుడు సీఎం కేసీఆర్‌, మంత్రివర్గం తగిన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.

రాష్ట్రంలో ఆక్సిజన్‌ బెడ్‌ల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్‌ రాష్ట్రానికి వచ్చేందుకు 6 రోజుల సమయం పడుతోందని.. అందుకే విమానాలు ఉపయోగిస్తున్నట్టు తెలిపారు. కరోనా పాజిటివ్‌ వచ్చి.. లక్షణాలుంటేనే వైద్యం అందించాలని ఐసీఎంఆర్‌ చెప్పిందని సోమేష్‌ కుమార్‌ గుర్తుచేశారు.

లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా చికిత్స మొదలు పెట్టాలని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న కొవిడ్‌ ఓపీ సర్వీసు వద్దకు వెళ్తే.. లక్షణాలున్న వారికి మందులు ఇస్తారని చెప్పారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆస్పత్రికి రావాల్సిన అవసరమే ఉండదని అన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలను దాచడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా సీఎస్‌ చెప్పారు.

Next Story

RELATED STORIES