ఎనిమిది ఎకరాల్లో టమాటా సాగు.. ఒక్క నెలలోనే రూ.1.80 కోట్ల సంపాదన

టమాటా పంట పండింది.. రైతుల ఇంట కాసులు కురిపిస్తోంది. మునుపెన్నడూ లేనంత ధర పలుకుతోంది. దీంతో రైతు కళ్లలో ఆనందం వెల్లి విరుస్తోంది. ఎప్పుడూ గిట్టు బాటు ధర కూడా రాని రైతుకి ఈసారి కోట్లు తెచ్చిపెడుతోంది. టమాటా వ్యాపారులు, సాగు చేస్తున్న రైతులు తమ కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని సంతోషిస్తున్నారు.
మెదక్ రైతు టమోటాలు అమ్మడం ద్వారా కోటీశ్వరుడు అయ్యాడు. తాను పండించిన టమాటాను అమ్మి రూ. 1.80 కోట్లు సంపాదించాడు. కౌడిపల్లికి చెందిన మహిపాల్ రెడ్డి (37) ఎనిమిది ఎకరాల్లో టమాటా సాగు చేశాడు.
మండు వేసవిలో పంటను బతికించుకునేందుకు రెడ్డి షేడ్ నెట్‌ల కింద వాటిని పెంచి కాపాడుకున్నాడు. జూన్ మధ్యలో టమాటా మార్కెట్‌లో కరువయ్యింది. టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో మహిపాల్‌రెడ్డి పంట చేతికొచ్చింది. టమాటా ధరలు విపరీతంగా పెరిగి నెల రోజుల వ్యవధిలో అతడిని కోటీశ్వరునిగా మార్చాయి.
సాధారణంగా పటాన్‌చెరు, షాపూర్, బోవెన్‌పల్లి మార్కెట్‌లకు టమాటా సరఫరా చేసే రెడ్డికి కిలో రూ.100కు పైగా లభించడం ప్రారంభమైంది. మీడియాతో మాట్లాడిన రెడ్డి, తాను రెండు దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్నానని, అయితే ఒక నెలలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బు రావడం ఎప్పుడూ చూడలేదని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com