HYD: స్విమ్మింగ్ పూల్‌లో కరంట్ షాక్

హైదరాబాద్ శివారు జల్‌పల్లి శివారులో ఫాంహౌస్‌కు వచ్చిన పలువురు స్విమ్మింగ్ పూల్‌లోకి దిగి కరెంట్ షాక్‌కు గురై తీవ్రగాయాల పాలయ్యారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మూడు కుటుంబాలకు చెందిన 56 మంది జల్‌పల్లిలోని ఫాంహౌస్‌కు వచ్చారు. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అయింది. దీంతో ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు, ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి.
ఈత కొడుతుండగా ఆ నీటిలోకి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా అవడంతో వీరంతా గాయపడ్డారు. కొలను చివరిభాగంలో ఉన్న ఆరుగురు మహిళలు, ఐదుగురు చిన్నారులు, ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. కొలను మధ్యలోనే ఉన్న పర్వేజ్(19), ఇంతియాజ్(22) రెండు నిమిషాల పాటు విద్యుదాఘాతానికి గురయ్యారు. తీవ్ర గాయాలయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. ఈతకొలను లోపల లైటింగ్ కోసం ఏర్పాటుచేసిన వైరింగ్ తెగిపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఈతకొలనులోని దీపాల వైర్ల కనెక్షన్లను లోపలి నుంచి కాకుండా బయటినుంచి ఇచ్చారు. ఈ వైరు కొలనులో తెగిపోవడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతం అయినట్లు పేర్కొన్నారు.
మరోవైపు హైదరాబాద్ నగరంలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. దీంతో వారు గొడ్డలితో దాడికి యత్నించగా అప్రమత్తమైన పోలీసులు ఒకరిని పట్టుకున్నారు. మరో వ్యక్తి రాళ్లతో దాడి చేస్తూ తప్పించుకుంటుండగా పోలీస్ డెకాయ్ టీమ్ కాల్పులు జరిపింది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com