Telangana : తెలంగాణలో రాత్రి కర్ఫ్యూపై క్లారిటీ

Telangana : తెలంగాణలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ విధించే పరిస్థితి లేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందన్న ఆయన.. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితేనే నైట్ కర్ఫ్యూ వంటి ఆంక్షలు అవసరమన్నారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తప్పుడు గణాంకాలు సమర్పిస్తోందని పిటిషనర్ల తరుపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఏజీ ప్రసాద్.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ సందర్భంగా మాస్కులు, భౌతిక దూరం కూడా అమలు కాకపోవడం దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. కొవిడ్ నిబంధనలను జీహెచ్ఎంసీ, పోలీసులు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది. కరోనా పరిస్థితి, రాష్ట్రంలో కేసులను వివరించేందుకు డీహెచ్ శ్రీనివాసరావు తదుపరి విచారణకు హాజరు కావాలన్న హైకోర్టు.. విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com