ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదు : మంత్రి ఈటెల

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని మంత్రి ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు. రాష్ట్రాల విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తెలంగాణకు 4 లక్షల రెమ్‌డిసివర్ ఇంజక్షన్లు కావాలని ఆర్డర్ ఇస్తే.. కేవలం 21,550 వాయిల్స్ మాత్రమే కేంద్రం ఇవ్వడం సరికాదన్నారు. కరోనా వ్యాక్సిన్ లాగే రెమ్‌డిసివర్ ఇంజక్షన్లను కూడా తమ ఆధీనంలోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడంపై అసహనం వ్యక్తంచేశారు.
తెలంగాణలో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని.. బ్లాక్ మార్కెట్ లో ఆక్సిజన్ సరఫరా చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఆక్సిజన్ పై ఐఏఎస్ ల బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందన్నారు. ఇతర రాష్ట్రాల కరోనా రోగులు కూడా హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. తమిళనాడు తరహాలో తమ ఆక్సిజన్ తామే వాడుకునే అవకాశం ఉన్నా.. ప్రజలందరి ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని అలా చేయడం లేదని స్పష్టంచేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com