నిరుద్యోగ యువతకు గాలం వేసి.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట టోకరా

AMC కంపెనీ పేరుతో నిరుద్యోగులను మోసం చేసిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. వందల సంఖ్యలో బాధితులున్నట్టు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను ప్రభుత్వం నుంచి అందేలా చూస్తామని... జనాలను ముఠా సభ్యులు మభ్యపెట్టారు. దీనికోసం ముందుగా నిరుద్యోగ యువతకు గాలం వేసి రిక్రూట్‌మెంట్ చేసుకున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్టు పోలీసుల విచారణలో తేలింది. దీనికి సంబంధించి యూపీకి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఒక్కొక్కరి వద్ద నుంచి 50 వేల వరకు వసూలు చేసినట్టు తెలిసింది. లక్నో కేంద్రంగా జాబ్ ఫ్రాడ్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. నౌకరీ వెబ్‌సైట్ నుంచి రెజ్యూమ్‌లను తీసుకుని.. కెరీర్ స్టైల్ పేరుతో నకిలీ వెబ్ సైట్ క్రియేట్ చేశారు. అలా హైదరాబాద్ యువతకు గాలం వేశారని సీపీ సజ్జనార్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com