Cyclone: తెలంగాణలో తుపాన్ ప్రభావం..

Cyclone: తెలంగాణలో తుపాన్ ప్రభావం..
భద్రాద్రి సహా 4 జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్

మిగ్‌జామ్‌ తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావం అటు ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణలోనూ తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ అలెర్ట్‌ జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డిలలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మంగళవారం నాడు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తుపాన్ కారణంగా గాలులు పెరగడంతో తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని IMD వెల్లడించింది.

తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాలు మేఘావృతమై ఉండగా చలిగాలులు వీస్తున్నాయి. తుఫాను ప్రభావంతో వచ్చే రెండు రోజులు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌ కర్నూల్‌జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, గంటకు 40నుంచి.. 50కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story