Dalit Bandhu: దళితబంధు రూ.10 లక్షలతో పథకాలు.. జాబితా విడుదల చేసిన సర్కారు

Dalit Bandhu: దళితబంధు రూ.10 లక్షలతో పథకాలు.. జాబితా విడుదల చేసిన సర్కారు
దళితబంధు పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి కొన్ని పథకాల జాబితా ప్రవేశ పెట్టింది.

Dalit Bandhu: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్మాతకంగా తలపెట్టిన దళితబంధు పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే వీటితో ఏం చేయవచ్చో ప్రభుత్వమే చొరవ తీసుకుని కొన్ని పథకాల జాబితా ప్రవేశ పెట్టింది.

గ్రామాలు, గ్రామాలు-ఉప పట్టణాలు, గ్రామాలు-పట్టణాలు, పట్టణాలు ఇలా నాలుగు రకాలుగా విభజించి జాబితాను రూపొందించింది. గతంలో ఉన్న ప్రభుత్వ పథకాలకు భిన్నంగా ఆ జాబితా ఉంది. వీటితో పాటు మరిన్ని అంశాలను కూడా ఇందులో చేర్చనుంది.

వాసాల మర్రిలో పథకం ప్రారంభమైనా.. పైలెట్ ప్రాజెక్టు కింద హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 16న సీఎం కేసీఆర్ శాలపల్లి-ఇందిరానగర్ వద్ద దళితబంధును ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు ఈ యూనిట్లను అందజేయనున్నారు. వీటి కొనుగోళ్లకు సంబంధించిన విధివిధానాలకు ప్రభుత్వం ఒకటీ రెండు రోజుల్లో తెలియజేయనుంది.

జాబితా ఈ విధంగా..

గ్రామాలు: మినీ డెయిరీ యూనిట్ (10 నుంచి 12 పాడి గేదెలు), పందిరి కూరగాయల సాగు- వరినాటు యంత్రాలు 2+1 పవర్ టిల్లర్, వేపనూనె- పిండి తయారీ+ ఆటో ట్రాలీ

గ్రామాలు, ఉప పట్టణాలు: సాగు యంత్ర పరికరాల దుకాణం, మట్టి ఇటుకల తయారీ+ఆటో ట్రాలి, ట్రాక్టర్+ట్రాలీ, కోడి పిల్లల పెంపకం (నాటు, బాయిలర్ కోళ్లు)+ఆటో ట్రాలీ

గ్రామాలు, పట్టణాలు: సెవెన్ సీటర్ ఆటో, 3 ఆటో రిక్షాలు, 3 సరుకు రవాణా చేసే మూడు చక్రాల ఆటో ట్రాలీలు, ప్రభుత్వం అనుమతించిన విత్తనాలు-ఎరువులు-పురుగుమందుల దుకాణం, టెంట్‌హౌస్-డెకరేషన్ లైటింగ్, సౌండ్ సిస్టం+ఆటో ట్రాలీ, మడిగల నిర్మాణం-వ్యాపారం (సొంత ఇంటి వద్ద స్థలం ఉన్నవారు), ఆయిల్ మిల్లు- పిండిగిర్నీలు

పట్టణాలు: 4 చక్రాల సరకు-ప్రయాణికుల వాహనం, ఎలక్ట్రానిక్స్ దుకాణం, రోగ నిర్ధారణ కేంద్రం+మెడికల్ షాపు, ఎలక్ట్రికల్+బ్యాటరీల షాపు, హార్డ్‌వేర్-శానిటరీ దుకాణం+ఆటోట్రాలీ, సిమెంటు ఇటుకలు తయారీ+ఆటోట్రాలీ, సెంట్రింగ్-ఆర్‌సీసీరూఫ్ తయారీ+కాంక్రీటు మిశ్రమం తయారీ యంత్రం, టైల్స్-ఆక్రిలిక్ షీట్ల షాపు+ఆటోట్రాలీ, మూడు కాంక్రీటు మిశ్రమ తయారీ యంత్రాలు, హోటల్+క్యాటరింగ్+ఆటో ట్రాలీ, ఐరన్‌గేట్లు-గ్రిల్స్ తయారీ యూనిట్+ఆటో ట్రాలీ, ప్రభుత్వ అనుమతితో మెడికల్ జనరల్ స్టోర్స్, ఫ్రాచైజీలో మినీ సూపర్ బజార్, డీటీపీ-మీసేవ-ఆన్‌లైన్ సేవలు+ఫోటో స్టూడియో, బిల్డింగ్ సామాగ్రి హార్డ్‌వేర్ దుకాణం.

Tags

Read MoreRead Less
Next Story