MEDIGADDA: మేడిగడ్డ వెనక కుట్ర కోణం లేదు

MEDIGADDA: మేడిగడ్డ వెనక కుట్ర కోణం లేదు
స్పష్టం చేసిన ఈఎన్‌సీ మురళీధర్‌... క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కేంద్ర కమిటీ

మేడిగడ్డ ఆనకట్ట కుంగిపోవడం వెనక ఎలాంటి కుట్ర కోణం లేదని తెలంగాణ నీటిపారుదల శాఖ ENC మురళీధర్ తెలిపారు. ఇసుకలో వచ్చిన కదలికల వల్లే కుంగి ఉండవచ్చన్న ఆయన ప్రాజెక్టులో ఎలాంటి నాణ్యతా లోపం లేదని కేంద్ర బృందంతో సమావేశం తర్వాత చెప్పారు. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించినడ్రాయింగ్, డిజైన్లను పరిశీలించిన కేంద్ర బృందం ఫౌండేషన్ ఇన్వెస్టిగేషన్, త్రీడీ నమూనా వివరాలు కావాలని కోరింది. మేడిగడ్డ ఆనకట్ట కుంగిన ప్రాంతాన్ని పరిశీలించిన కేంద్ర బృందం పీయర్స్‌ పరిస్థితిపై క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. హైదరాబాద్‌లో.. తెలంగాణ నీటిపారుదలశాఖ ఈఎన్సీలు, ఇంజనీర్లతో సమావేశమైన కేంద్ర బృందం ఆనకట్టకు సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకుంది. ఆనకట్ట నిర్మాణానికి సంబంధించిన డ్రాయింగ్స్, డిజైన్లు, యంత్ర సామగ్రి, పరికరాలు, పద్ధతులు..., నిర్వహణ తీరుపై ఆరా తీసింది. ఫౌండేషన్ ఇన్వెస్టిగేషన్, బ్యారేజ్ త్రీడీ నమూనాలు కావాలని అడిగినట్లు తెలిసింది. సాంకేతికపరమైన విషయాలపైనా..ఆరా తీసినట్లు సమాచారం. తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్లు కేంద్ర బృందం అడిగిన అన్ని వివరాలు, సమాచారాన్ని అందించారు. పీయర్ ఒకవైపు మాత్రమే కుంగిందని, మరోవైపు కుంగలేదని అన్నట్లు తెలిసింది. నీరు తగ్గాక ఫౌండేషన్ ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన వివరాలు అందిస్తామని చెప్పినట్లు తెలిసింది.


ప్రాజెక్టు డిజైన్., నిర్మాణంలో ఎలాంటి లోపం లేదని సమావేశం తర్వాత నీటిపారుదలశాఖ ENC మురళీధర్ చెప్పారు. ఫౌండేషన్ కింద ఇసుక కదలిక వల్ల సమస్య వచ్చి ఉండవచ్చన్న ఆయన... వరద ఉద్ధృతి తగ్గాక మరమ్మతు పనులు చేపడతామన్నారు. ఆనకట్ట కుంగిన వైపు ఇప్పటికే. నీటి ప్రహావాన్ని తగ్గించారు. ఆ వైపు ప్రవాహం పూర్తిగా తగ్గేలా అర్ధచంద్రాకారంలో కాఫర్ డ్యాం నిర్మించాలని భావిస్తున్నారు. ఈ పనులు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తర్వాత ఏం జరిగిందన్న అంశంపై..... పూర్తి అంచనాకు రావచ్చని, అనంతరం పునర్నిర్మాణ పనులు చేపట్టవచ్చని ఇంజినీర్లు చెబుతున్నారు.ఆనకట్టను మొత్తం 8 బ్లాకులుగా విభజించి నిర్మించినందున... కేవలం ఏడో బ్లాకుపైనే ప్రభావం ఉంటుందని అంటున్నారు. నీటినిల్వ సామర్థ్యం.. కొంత తగ్గుతుందని, పంపులు ఎత్తిపోసేందుకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండబోదని చెబుతున్నారు.

పునాదుల వద్ద ఇసుక తరలివెళ్లడం వల్లే మేడిగడ్డ బ్యారేజీలో పియర్స్‌కు నష్టం వాటిల్లినట్లు కేంద్ర జల సంఘం నియమించిన కమిటీ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. నీటి ప్రవాహం తగ్గిన తర్వాత దెబ్బతిన్న పియర్స్‌ ఉన్న బ్లాక్‌కు కాఫర్‌డ్యాం నిర్మించి మరింత లోతుగా పరిశీలించిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకు సంబంధించిన డిజైన్స్‌, డ్రాయింగ్స్‌తో సహా అని వివరాలు పంపితే తాము కూడా పరిశీలించి అవసరమైన సూచనలు చేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు సూచించినట్లు తెలిసింది.

Tags

Next Story