Deccan Mall Accident: తెలంగాణ సర్కార్ అలర్ట్

డెక్కన్ మాల్ ప్రమాదంతో తెలంగాణ సర్కార్ అలర్ట్ అయ్యింది. ఇవాళ జీహెచ్ఎంసీ, ఫైర్ సేఫ్టీ, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైయ్యింది. మధ్యాహ్నాం 3గంటలకు సీడీఎంఏ కార్యాలయంలో అధికారులు సమావేశమయ్యారు. నగరంలో వాణిజ్య భవనాల అనుమతులు, ఫైర్ అనుమతులతో పాటు పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఇదిలా ఉండగా డెక్కన్ మాల్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రమాదం జరిగి 4 రోజులు గడుస్తున్నా ఇప్పటికీ మృతదేహాలు దొరకలేదు. ప్రమాద సమయంలో మాల్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిన ఫైర్ సిబ్బంది.. ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే మరో రెండు మృతదేహాల గుర్తింపు ఫైర్ సిబ్బందికి సవాలుగా మారింది. బిల్డింగ్ స్లాబులు క్రమ క్రమంగా కూలిపోతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ తీవ్ర ఇబ్బందికరంగా మారింది. మరోవైపు బిల్డింగ్ కూల్చివేతకు అనుమతులు వచ్చినప్పటికీ.. మృతదేహాలు లభ్యం కాకపోవడంతో అధికారులు సందిగ్ధంలో పడ్డారు. నిన్న మృతదేహాల కోసం ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేసినా.. ఎక్కడా ఆనవాలు కన్పించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com