TS ASSEMBLY: కుల గణన సర్వే తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

తెలంగాణలో సర్వీస్ కమిషన్ చేపట్టిన సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ నివేదికపై సభ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేయగా మంత్రులు సహా, సీఎం వారి అనుమానాలకు స్పష్టత ఇచ్చారు. ఈ సమావేశంలో చివర్లో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే తీర్మానానికి ఆమోదం తెలపాలని పిలుపునిచ్చారు. దీంతో సామాజిక, ఆర్థిక, కుల గణన సర్వే తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ ఆమోదం తెలిపిన కులగణన వివరాలు ఇకపై అధికారిక లెక్కలుగా రూపొందనున్నాయి. ఈ లెక్కల ఆధారంగా రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
మండలిలో భట్టి
శాసనమండలిలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సర్వే చరిత్రలో నిలిపోతుందని తెలిపారు. దాదాపు రాష్ట్రం మొత్తం ఈ సర్వే పూర్తయిందన్నారు. ఈ సర్వే నివేదికను చదువుతూ.. ఏ ఏ సామాజిక వర్గం ఎంత శాతం ఉందనే వివరాలను ఆయన వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై కమిషన్ సారాంశంపై ప్రభుత్వం ప్రకటన చేసింది. అందులో 3 గ్రూపులుగా ఎస్సీలను వర్గీకరించాలని కమిషన్ సిఫారసు చేసింది. అలాగే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపిన కొద్దిసేపటికే శాసనమండలి వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగూణంగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా.. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ తో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు.
నేపథ్యం ఇదీ
ఆగస్టు 1, 2024న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో తెలంగాణలో మొదటగా ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగా.. 11, 2024న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com