దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌ కేసు : అదే టెక్నాలజీతో కిడ్నాపర్‌ను పట్టుకున్న పోలీసులు

దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌ కేసు : అదే టెక్నాలజీతో కిడ్నాపర్‌ను పట్టుకున్న పోలీసులు
X
మహబూబాబాద్‌లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌ కథ విషాదాంతమైన ఘటన ఇప్పుడు అందరిని కలచివేస్తోంది. బాలుణ్ని కిడ్నాప్ చేసిన దుండగుడు అతి కిరాతకంగా హత్య చేసి..

మహబూబాబాద్‌లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్‌ కథ విషాదాంతమైన ఘటన ఇప్పుడు అందరిని కలచివేస్తోంది. బాలుణ్ని కిడ్నాప్ చేసిన దుండగుడు అతి కిరాతకంగా హత్య చేసి.. పోలీసులకు దొరికిపోతామనే భయంతో అక్కడే మృతదేహాన్ని దహనం చేశాడు. అయితే దీక్షిత్‌ క్షేమంగా తిరిగి వస్తాడనుకుంటే విగతజీవిగా మారి వచ్చాడు. దీంతో బాలుడి ఇంట పెను విషాదం నెలకొంది. ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. ఊరుఊరంతా బాలుడి ఇంటివద్దకు చేరుకొని రోదిస్తున్నారు. బాలుడిని చంపేసిన క్రూరమృగానికి కఠిన శిక్ష వేయాలని కోరుతున్నారు.

కాగా దీక్షిత్‌రెడ్డి కిడ్నాప్ అయిన వెంటనే ఏం చేయాలో అర్థంకాక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. కేసును ఛేదించేందుకు హైదరాబాద్, వరంగల్ టాస్క్ ఫోర్స్ తో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ముందుగా సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు బాలుడి తల్లిదండ్రులను విచారించారు.. కిడ్నాపర్ ఫోన్ చేసిన విషయాన్ని వారు పోలీసులకు చెప్పగా.. ఆ కాల్ ఎలా వచ్చిందో ట్రేస్ చేశారు.. కిడ్నాపర్ ఉపయోగించిన టెక్నాలజీతోనే చివరకు కేసును ఛేదించారు. ఇంటర్నెట్ కాల్ ద్వారా కిడ్నాపర్ మాట్లాడిన ప్రదేశాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.. ఈరోజు తెల్లవారుజామున మూడు గంటల సమయంలో మందసాగర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

మరోవైపు ఈ కేసులో 30 మంది అనుమానితులను విచారించిన పోలీసులు చివరకు ఒక్కడే నిందితుడుగా తేల్చారు.. కిడ్నాప్ కేసులో మరికొంతమంది హస్తం ఉండి ఉండవచ్చని తాము భావించామని.. కానీ, విచారణలో మందసాగర్ ఒక్కడే కిడ్నాప్, హత్యకు పాల్పడినట్లు తేలిందన్నారు.. అటు దీక్షిత్ రెడ్డి కిడ్నాప్, హత్యను నిరసిస్తూ మహబూబాబాద్ లో స్థానికులు ఆందోళనకు దిగారు.. నిందితులను ఉరితీయాలంటూ రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు.. స్థానికుల ధర్నాతో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.. చివరకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags

Next Story