దీక్షిత్‌ కిడ్నాప్.. పోలీసుల అదుపులో బాబాయ్‌ మనోజ్‌

దీక్షిత్‌ కిడ్నాప్.. పోలీసుల అదుపులో బాబాయ్‌ మనోజ్‌
X
మహబుబాబాద్‌ జిల్లాలో పదేళ్ల దీక్షిత్‌ కిడ్నాప్ కేసులో.. మిస్టరీ కొనసాగుతునే ఉంది. రెండ్రోజులుగా దీక్షిత్‌ కిడ్నాపర్‌ చెరలోనే ఉన్నాడు. ఇప్పటివరకు బాలుడికి ఆచూకీకి సంబంధించి ఎలాంటి..

మహబుబాబాద్‌ జిల్లాలో పదేళ్ల దీక్షిత్‌ కిడ్నాప్ కేసులో.. మిస్టరీ కొనసాగుతునే ఉంది. రెండ్రోజులుగా దీక్షిత్‌ కిడ్నాపర్‌ చెరలోనే ఉన్నాడు. ఇప్పటివరకు బాలుడికి ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరలేదు. దీక్షిత్ కోసం.. 8 ప్రత్యేక పోలీసుల బృందాలు రంగంలో దిగాయి. మొత్తం వంద మంది సిబ్బంది టీం వర్క్‌ చేస్తోంది. ఇద్దరు డీఎస్పీలు, 8 మంది సీఐలు, 15 మంది ఎస్సైల నేతృత్వంలో పోలీసుల గాలింపు కొనసాగుతోంది.

అయితే ఈ కేసులో పోలీసులు కాస్త పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. దీక్షిత్‌ను పట్టణ పరిసరాల్లోనే కిడ్నాపర్లు బంధించినట్లు గుర్తించారు. బాలుడి బంధువులు సహా మరో నలుగురిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కిడ్నాప్‌ వ్యవహారంలో... పిల్లాడి బాబాయ్‌ మనోజ్‌ను అదుపులో తీసుకున్నప్పటి నుంచి ఫోన్‌ కాల్స్‌ నిలిచిపోయాయి. దీంతో మనోజ్‌పై అనుమానాలు పెరుగుతున్నాయి. అయితే అతన్ని అదుపులో తీసుకున్నా కూడా ... మరోసారి బెదిరింపు కాల్స్‌ రావడంతో.... కిడ్నాపర్‌ ఎవరనేది తేల్చలేకపోతున్నారు పోలీసులు.

దీక్షిత్‌ తల్లి వసంతకు మరోసారి ఫోన్ చేసి బెదిరించాడు కిడ్నాపర్‌. రూ. 45 లక్షలు సిద్ధం చేసుకోవాలని హెచ్చరించాడు. ఎక్కడ ఇవ్వాలో ఇవాళ ఫోన్‌ చేసి చెబుతానని చెప్పాడు. అయితే.. అంత డబ్బు లేదని, కొంత మొత్తం మాత్రమే సిద్ధం చేశామని చెప్పింది వసంత. ఆమె మాటలు వినిపించుకోని కిడ్నాపర్ డబ్బు సిద్ధం చేయాల్సిందేనంటూ కాల్‌ కట్‌ చేశాడు..

కిడ్నాపర్‌ ఫోన్‌ కాల్‌ రాగానే అప్రమత్తమైన పోలీసులు.. లొకేషన్‌ను ట్రేస్‌ చేశారు. బీహార్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నట్లు గుర్తించారు. మొత్తానికి దీక్షిత్‌ కిడ్నాప్‌ వ్యవహారం.. పోలీసులకు సవాల్‌గా మారింది. 200 సీసీకెమరాలు, 6 ఏఎనస్పీఆర్‌ కెమెరాలకు సైతం కిడ్నాపర్ల జాడ చిక్కలేదు. టెక్నాలజీ వాడకంలో పోలీసులకంటే కిడ్నాపర్లు అడ్వాన్స్‌గా ఉన్నట్లు తెలుస్తోంది..

అయితే ఈ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు... దీక్షిత్‌ ఆచూకీ కోసం సెర్చింగ్‌ వేగవంతం చేశారు. ఇప్పటికే అనుమానితుల్ని అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. దగ్గరి బందువులే కిడ్నాప్‌ చేశారా అన్ని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు... రెండ్రోజులైనా దీక్షిత్‌ ఆచూకీ తెలియకపోవడంతో... తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Tags

Next Story