Revanth Reddy: మాస్ లీడర్.... రేవంత్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌కు జవసత్వాలు కూడగట్టి ఆ పార్టీని గెలిపించిన రేవంత్‌రెడ్డి 1969 నవంబరు 8న నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో జన్మించారు. తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ. వనపర్తిలో.. పాలిటెక్నిక్ చేసిన ఆయన... ఏవీ కళాశాలలో బీఏ చదివారు. విద్యార్థిగా ABVPలో పనిచేశారు. తెరాస ఆవిర్భావం అనంతరం కొన్నాళ్లు ఆ పార్టీలో పనిచేశారు. 2006లో మిడ్జిల్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2007లో మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా శాసనమండలి ఎన్నికల్లో....... స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. 2008లో తెలుగుదేశంలో చేరి 2009లో కొడంగల్ నుంచి బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి గురనాథ్‌రెడ్డిపై గెలిచారు. 2014 ఎన్నికల్లో రెండోసారి అక్కడి నుంచే గెలిచారు. 2017లో కాంగ్రెస్‌లో చేరిన ఆయన2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ‌్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచారు. 2021లో టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ఆయన.... ప్రస్తుత ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించారు.ఈ ఎన్నికల్లో మరోసారి కొడంగల్ నుంచి గెలిచిన ఆయన.. సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. ఈ బాధ్యత తనకు అప్పగించినందుకు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యావాదాలు తెలిపారు.
పార్టీలో చేరి పదేళ్లు కాకున్నా కాకలు తీరిన నేతలతో సాధ్యపడని లక్ష్యాన్ని ముద్దాడి శతాధిక పార్టీని అధికారంలోకి తెచ్చిన నేత. అలుపెరగని పోరాటంతో అనధి కాలంలోనే అగ్రనేతగా ఎదిగి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్నారు.... అనుముల రేవంత్‌రెడ్డి. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబరు 8న అనుముల నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మ దంపతులకు రేవంత్‌రెడ్డి జన్మించారు. వనపర్తిలో పాలిటెక్నిక్ చేసిన ఆయన..కాలేజీల్లో చదువుకునే సమయంలో విద్యార్థి సంఘంలో చురుగ్గా ఉండేవారు. 2002లో తెరాసలో చేరి.. కొంతకాలమే ఆపార్టీలో కొనసాగిన రేవంత్‌రెడ్డి . ZPTCగా పోటీచేసి, తొలిసారి 2006లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సొంతూరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నా.. కల్వకుర్తి నియోజకవర్గంలోని మిడ్జిల్ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి.. ZPTCగా రేవంత్‌రెడ్డి గెలుపొంది, ఆరంభంలోనే సత్తాచాటారు.
శాసనసభ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చటంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నిర్వహించిన పాత్ర అనిర్వచనీయం. రాష్ట్రవ్యాప్తంగా 80కి పైగా బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొని, విస్తృత ప్రచారం చేశారు. ప్రచార సభల్లో రేవంత్ ప్రసంగాలు.... జనాన్ని ఊర్రూతలూగించాయి. అధిష్ఠానం ఆదేశాలతో పార్టీ నేతలందరిని కలుపుకెళ్తూ... భారాసను గద్దె దించి, పూర్తి ఆధిక్యతతో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటులో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నిర్వర్తించిన బాధ్యత కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుందనటంలో సందేహంలేదు .
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com