Delhi: పార్లమెంట్ లో బీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన

Delhi: పార్లమెంట్ లో బీఆర్‌ఎస్‌ ఎంపీల నిరసన
ఆదానీ మోసాలపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్

పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట బీఆర్ఎస్‌ ఎంపీలు గురువారం నిరసన చేపట్టారు. ఆదానీ మోసాలపై జేపీసీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ ఎంపీలు కూడా ప్లకార్డులు ప్రదర్శించారు. అదానీ స్టాక్స్ మోసాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలని బీఆర్ఎస్‌, ఆప్‌ పార్లమెంట్‌లో డిమాండ్ చేశాయి. ఉభయసభలను బహిష్కరించిన ఇరు పార్టీలు ధర్నాకు దిగాయి. అదానీ గురించి ఎన్నో ప్రశ్నలు వేశామని కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదని ఎంపీలు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story