Delhi: షర్మిల అరెస్ట్‌.. కాళేశ్వరంపై విచారణ జరిపించాలని డిమాండ్‌

Delhi: షర్మిల అరెస్ట్‌.. కాళేశ్వరంపై విచారణ జరిపించాలని డిమాండ్‌
కేసీఆర్‌ హఠావో..తెలంగాణ బచావో నినాదంతో హోరెత్తిన జంతర్‌మంతర్‌

నేడు ఢిల్లీలో వైఎస్‌ఆర్‌టీపీ ఆధ్వర్యంలో ఛలో పార్లమెంట్‌కు పిలుపునిచ్చారు వైఎస్‌ షర్మిల. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలోని అవినీతిపై విచారణ జరిపించాలని ఆమె డిమాండ్‌ చేశారు. అయితే జంతర్‌ మంతర్‌ నుంచి పార్లమెంట్‌కు వెళుతుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండటంతో ఆందోళనకు అనుమతించడం కుదరదన్నారు. అయినా వెళ్లే ప్రయత్నం చేయడంతో షర్మిలను, వైటీపీ శ్రేణులను పార్లమెంట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో పాటు కేసీఆర్‌ ప్రభుత్వంలోని అవినీతిపై విచారణ జరిపించాలని షర్మిల జంతర్‌మంతర్‌లో ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌టీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్‌ హఠావో.. తెలంగాణ బచావో అంటూ నినాదాలు చేశారు.

Tags

Next Story