MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురు..

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై బెయిల్‌ను నిరాకరిండంతో పాటు పిటిషన్లను తిరస్కరిస్తూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా తుది తీర్పును వెల్లడించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో పిటిషన్ దాఖలు చేయగా వాటిని తిరస్కరించింది. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే, స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని కవిత తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.
మహిళగా పీఎంఎల్‌ఏ సెక్షన్ 45 ప్రకార్ బెయిల్‌కు అర్హత ఉందని తెలిపారు. ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని, అరెస్టు సరైన కారణాలు లేవని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే, సీబీఐ, ఈడీ కవితకు బెయిల్ ఇవ్వొద్దని.. దర్యాప్తును ప్రభావితం చేస్తారని వాదనలు వినిపించాయి. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్‌ను తిరస్కరిస్తూ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. మద్యం పాలసీ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. సీబీఐ, ఈడీ కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లు మరోసారి తిరస్కరణకు గురయ్యాయి. అయితే తాజాగా కవిత మాట్లాడుతూ.. నేను అప్రూవర్ గా మారేది లేదని, కడిగిన ముత్యంలా బయటికి వస్తానని అన్న విషయం తెలిసిందే. ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ.. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. మూడో నిందితుడు రూ.50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడని తెలిపారు. క్లీన్ గా బయటకు వస్తా.. అప్రూవ్ వర్ గా మారేది లేదని క్లారిటీ ఇచ్చారు. మరి రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com